News April 1, 2025
నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.
Similar News
News April 3, 2025
ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.
News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
News April 3, 2025
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ: ఏలూరు కలెక్టర్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పట్ల ప్రేమా ఆప్యాయతలను పంచాలి అని కలెక్టర్వెట్రి సెల్వి అన్నారు. ఏలూరులో గురువారం ఓ జరిగిన కార్యక్రమంలో 500 మంది పిల్లలకు రూ.75 లక్షల విలువ చేసే వివిధ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా విద్యశాఖ, సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ఆధ్యర్యంలో వీటిని అందజేశారు.