News April 1, 2025

MBNR:సన్నబియ్యం పంపిణీ షురూ..లబ్ధిదారుల ఖుషి

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఇవాళ షురూ అయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సన్నబియ్యం సంబరాల వాతావరణం నెలకొంది. ఉదయం 8గంటల నుంచే MBNR, NRPT, GDL, NGKL, WNP జిల్లాలలోని రేషన్‌ షాపులదగ్గర లబ్ధిదారులు బారులుతీరారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నడంతో తెల్లరేషన్ కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 3, 2025

ఈ తీర్పు రేవంత్ చర్యలకు చెంపపెట్టు: హరీశ్

image

TG: గచ్చిబౌలి కంచ <<15980925>>భూములపై <<>>సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును BRS నేత హరీశ్‌రావు స్వాగతించారు. ‘ఈ తీర్పు CM రేవంత్ దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు కంచ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే చట్టం ఊరుకోదు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం. వారికి అభినందనలు’ అని Xలో రాసుకొచ్చారు.

News April 3, 2025

వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్ 

image

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.    

News April 3, 2025

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి జనర్సింహ

image

అందోల్: ప్రతి పేదవాడి వరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ గంజ్ ప్రాంతంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామన్నారు.

error: Content is protected !!