News April 1, 2025

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు

image

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. రేపు క్వశ్చన్ అవర్ పూర్తైన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు. 8 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని, అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు. బిల్లు గురించి వివరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు. మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

Similar News

News April 4, 2025

IPL: ముగిసిన LSG ఇన్నింగ్స్

image

లక్నోలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. మార్ష్(31 బంతుల్లో 60), మార్క్రమ్ (38 బంతుల్లో 53), బదోనీ (19 బంతుల్లో 30) రాణించారు. ముంబై బౌలర్లలో పాండ్య 5 వికెట్లతో చెలరేగారు. బౌల్ట్, అశ్వనీ కుమార్, పుతూర్ తలో వికెట్ తీశారు. ముంబై విజయ లక్ష్యం 204 పరుగులు.

News April 4, 2025

ఎల్లుండి ‘పెద్ది’ ఫస్ట్ షాట్, రిలీజ్ డేట్ గ్లింప్స్

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీరామ నవమి సందర్భంగా ఎల్లుండి ఉదయం 11.45 గంటలకు పెద్ది ఫస్ట్ షాట్‌తోపాటు రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ మిక్సింగ్ పూర్తయ్యిందంటూ ఏఆర్ రెహమాన్‌తో దిగిన ఫొటోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News April 4, 2025

నేపాల్‌లో భూకంపం

image

నేపాల్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల మయన్మార్‌లో భూకంపం ధాటికి 3వేల మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!