News April 1, 2025
విశాఖలో చిన్నారులతో భిక్షాటన

విశాఖలో చిన్నపిల్లలతో భిక్షాటన చేయించడం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. మరికొందరు ఒడిలో నెలల పిల్లలను పెట్టుకుని మరీ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో చిన్నపిల్లలు సొమ్మసిల్లుతున్న పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా లంకెలపాలెం, అగనంపూడి, గాజువాక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Similar News
News September 13, 2025
జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.