News April 1, 2025

నిత్యానంద స్వామి కన్నుమూత: బంధువు

image

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద(47) చనిపోయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం నిత్యానంద ఈ వదంతులు వ్యాప్తి చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News January 12, 2026

విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

image

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.

News January 12, 2026

ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

image

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్‌గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.

News January 12, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 10 ఎక్స్‌పర్ట్/స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా అర్హతతో పాటు పనిఅనుభవం గల వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in.