News April 1, 2025
పెరిగిన ఔషధాల ధరలు

దాదాపు 900 రకాల ఔషధాల ధరలను ఇవాళ్టి నుంచి గరిష్ఠంగా 1.74% మేర పెంచినట్లు NPPA వెల్లడించింది. ఇందులో యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, షుగర్ మెడిసిన్స్ ఉన్నాయి. సవరించిన ధరల ప్రకారం అజిత్రోమైసిస్ 250Mg ఒక్కో టాబ్లెట్ రేటు ₹11.87, 500Mg ధర ₹23.97కు చేరింది. డైక్లోఫెనాక్ ₹2.09, ఇబ్రూఫెన్ 200Mg ₹0.72, 400Mg ₹1.22గా పేర్కొంది. పూర్తి లిస్టును https://www.nppaindia.nic.in/లో చూడొచ్చు.
Similar News
News November 8, 2025
బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

టీ20 ఫార్మాట్‌లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.


