News March 26, 2024
ఆట పట్ల విరాట్ ఆకలి అలాగే ఉంది: డుప్లెసిస్

విరాట్ కోహ్లీలో క్రికెట్ పట్ల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ఆయన ఆర్సీబీ సహచరుడు డుప్లెసిస్ అన్నారు. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నారని కితాబిచ్చారు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో విరాట్ చాలా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈమధ్య కొన్ని నెలల విరామం తీసుకోవడంతో తాజాగా ఉన్నారు. బాగా ఆడాలనే తపన అతడిలో కనిపిస్తోంది’ అని వెల్లడించారు.
Similar News
News March 20, 2026
మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
News March 20, 2026
పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.
News March 20, 2026
టెన్త్ పరీక్షల రద్దుపై క్లారిటీ

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.


