News April 1, 2025
అమెరికాలో అత్యధిక పెట్స్ ఏవంటే?

అమెరికన్లు పెంపుడు జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగైదు రకాల పెట్స్ కూడా ఉంటుంటాయి. అయితే, అత్యధికంగా కుక్కలను పెంచుకునేందుకు వారు మొగ్గుచూపుతున్నట్లు అమెరికన్ పెట్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ తెలిపింది. USలో 65 మిలియన్ల పెట్ డాగ్స్ ఉండగా 47M పిల్లులున్నాయి. ఫ్రెష్ వాటర్ ఫిష్‌లు 11M, చిన్న జంతువులు 7M, పక్షులు 6M, రెప్టైల్స్ 6M, సాల్ట్ వాటర్ ఫిష్ – 2M, గుర్రాలు 2M ఉన్నాయి.
Similar News
News April 3, 2025
ముంబై యంగ్ ప్లేయర్‌కి CSK పిలుపు!

ఫామ్‌లో లేని బ్యాటింగ్ లైనప్‌తో ఇబ్బంది పడుతున్న CSK కొత్త టాలెంట్‌పై ఫోకస్ చేసింది. ముంబై సంచలనం ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిపించింది. ‘అతను మా టాలెంట్ స్కౌట్స్‌ను ఇంప్రెస్ చేశారు. జట్టుకు ఏది అవసరమో అది చేస్తాం. ప్రస్తుతం ఎవరినీ జట్టులోకి చేర్చుకోలేదు’ అని యాజమాన్యం తెలిపింది. ఆయుశ్ U-19 ఆసియా కప్‌లో 44Avg, 135.38SRతో 176 రన్స్, విజయ్ హజారే ట్రోఫీలో 65.43Avg, 135.50SRతో 458 పరుగులు చేశారు.
News April 3, 2025
APకి రండి.. ‘OPEN AI’ సీఈవోకు చంద్రబాబు ఆహ్వానం

AI వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ‘OPEN AI’ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘AIని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ AI-ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీతో మా విజన్‌ను పంచుకుంటాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
News April 3, 2025
ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.