News April 1, 2025

కాకాణికి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు

image

AP: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తనపై పోలీసులు <<15956367>>అక్రమ కేసులు<<>> నమోదు చేస్తున్నారని, కేసులు క్వాష్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Similar News

News April 3, 2025

ముంబై యంగ్ ప్లేయర్‌కి CSK పిలుపు!

image

ఫామ్‌లో లేని బ్యాటింగ్ లైనప్‌తో ఇబ్బంది పడుతున్న CSK కొత్త టాలెంట్‌పై ఫోకస్ చేసింది. ముంబై సంచలనం ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిపించింది. ‘అతను మా టాలెంట్ స్కౌట్స్‌ను ఇంప్రెస్ చేశారు. జట్టుకు ఏది అవసరమో అది చేస్తాం. ప్రస్తుతం ఎవరినీ జట్టులోకి చేర్చుకోలేదు’ అని యాజమాన్యం తెలిపింది. ఆయుశ్ U-19 ఆసియా కప్‌లో 44Avg, 135.38SRతో 176 రన్స్, విజయ్ హజారే ట్రోఫీలో 65.43Avg, 135.50SRతో 458 పరుగులు చేశారు.

News April 3, 2025

APకి రండి.. ‘OPEN AI’ సీఈవోకు చంద్రబాబు ఆహ్వానం

image

AI వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ‘OPEN AI’ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘AIని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ AI-ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీతో మా విజన్‌ను పంచుకుంటాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

News April 3, 2025

ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!