News April 1, 2025

ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఖైరిగూడ ఓసీపీ

image

బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఆసీఫ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని ఇన్‌ఛార్జ్ జీఎం నరేందర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఏరియాకు 4.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 5.43 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఉత్పత్తి శాతం 116గా నమోదైనట్లు చెప్పారు. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటామన్నారు.

Similar News

News February 26, 2026

HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

image

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.

News February 26, 2026

TU: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉపకులపతి

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, COE ఆచార్య సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఉపకులపతి అధికారులకు తగిన సూచనలు చేస్తూ, పరీక్షలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

News February 26, 2026

యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కే.పద్మరాజు

image

యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కె.పద్మరాజును నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ ఎన్.మోహనరావును బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లు యూనివర్సిటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. నూతన ప్రిన్సిపల్‌గా పద్మరాజు వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అపార అనుభవం ఉన్న ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.