News April 1, 2025
SSS: జిల్లా ప్రత్యేక అధికారిని కలిసిన కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారి హరినారాయణను కలెక్టర్ చేతన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం పెనుకొండలోని సబ్ కలెక్టర్ బంగ్లాలో ఆయనను కలిసి పూలగుత్తి ఇచ్చారు. ప్రభుత్వం హరినారాయణను జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. దీంతో ఆయన మొదటిసారిగా జిల్లాకి రావడంతో చేతన్ ఆయనను కలిసి జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపచేయడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించారు.
Similar News
News April 3, 2025
ముంబై యంగ్ ప్లేయర్‌కి CSK పిలుపు!

ఫామ్‌లో లేని బ్యాటింగ్ లైనప్‌తో ఇబ్బంది పడుతున్న CSK కొత్త టాలెంట్‌పై ఫోకస్ చేసింది. ముంబై సంచలనం ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిపించింది. ‘అతను మా టాలెంట్ స్కౌట్స్‌ను ఇంప్రెస్ చేశారు. జట్టుకు ఏది అవసరమో అది చేస్తాం. ప్రస్తుతం ఎవరినీ జట్టులోకి చేర్చుకోలేదు’ అని యాజమాన్యం తెలిపింది. ఆయుశ్ U-19 ఆసియా కప్‌లో 44Avg, 135.38SRతో 176 రన్స్, విజయ్ హజారే ట్రోఫీలో 65.43Avg, 135.50SRతో 458 పరుగులు చేశారు.
News April 3, 2025
అమరావతి: నేటితో మంత్రివర్గ సమావేశం ముగింపు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
News April 3, 2025
నంగునూర్: గులాబీ పువ్వులతో కనువిందు

ఆకాశం లేత నీలం రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ తెల్లటి మేఘాలు తేలియాడుతున్నాయి. నేలపై రాలిన లేత గులాబీ రంగు పూలతో వీధి చాలా అందంగా ఉంది. ఈ సమ్మోహన దృశ్యం సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం గట్లమల్యల గ్రామంలో చోటు చేసుకుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో నాటిన మొక్క నేడు వృక్షంగా మారి గులాబి పువ్వులతో ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఒక పెద్ద చెట్టు గులాబీ రంగు పూలతో పూర్తిగా నిండిపోయి ఆకర్షిస్తోంది.