News April 1, 2025
నాగర్‌కర్నూల్: కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి పట్టణానికి చెందిన వీరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు వీరెడ్డి ఆనంద రెడ్డి (32) బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆయన అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన HYDలోని ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందిన ఆయన ఈరోజు ఉదయం మృతిచెందాడు. పెళ్లి వార్షికోత్సవం రోజే మరణించడం మరింత బాధాకరం.
Similar News
News April 3, 2025
మరో వివాదంలో నిత్యానంద!

సజీవ సమాధి అయ్యారంటూ వార్తల్లో నిలిచిన <<15965534>>నిత్యానంద<<>> మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈక్వెడార్ సమీపంలో ‘కైలాస’ దేశం ఏర్పాటుచేసుకున్న ఆయన కన్ను బొలీవియాపై పడినట్లు సమాచారం. నిత్యానంద అనుచరులు 20మంది $2లక్షలకు ఓ ప్రాంతాన్ని 25ఏళ్ల లీజుకు తీసుకునేందుకు స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు. వెయ్యేళ్ల లీజుకు ప్రయత్నించగా విషయం బయటికొచ్చింది. దీంతో GOVT వారిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు(IND, చైనా, US) పంపింది.
News April 3, 2025
JEE అడ్మిట్ కార్డులు విడుదల

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈనెల 7,8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో NTA ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
News April 3, 2025
మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.