News April 1, 2025
విజయవాడ: ‘పేదల భద్రతే ప్రభుత్వ లక్ష్యం’

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని, ఇంటివద్దే పింఛన్ల పంపిణీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి తెలిపారు. మంగళవారం విజయవాడ రూరల్, గొల్లపూడి రెండో సచివాలయంలో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,28,813 లబ్ధిదారులకు రూ. 98.11 కోట్లు పంఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
Similar News
News April 3, 2025
ఇఫ్కో సెజ్ అభివృద్ధిపై ఎంపీ వేమిరెడ్డి భేటీ

నెల్లూరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం ఇఫ్కో సీఈవో ఉదయ్ శంకర్ అవస్థిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకుశంగా చర్చించారు. కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని MP వివరించారు.
News April 3, 2025
KCRకు హైకోర్టులో ఊరట

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో ఆయనపై నమోదైన రైలురోకో కేసును హైకోర్టు కొట్టేసింది. ఉద్యమ సమయంలో ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో KCR రైలురోకో చేపట్టారు. దీంతో ఆయనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కేసీఆర్ కోర్టును ఆశ్రయించగా, కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.