News April 1, 2025
రేపు వైసీపీ నేతలతో జగన్ భేటీ

AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన MPP, జడ్పీ ఉపఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో YCP అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ విజయం కోసం సహకరించిన వారిని స్వయంగా అభినందించనున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కేసులతో కూటమి ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం వీరంతా అంకితభావంతో పనిచేశారని YCP నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల MPTC, ZPTCలు, పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.
Similar News
News September 11, 2025
గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555
News September 10, 2025
‘అఖండ-2’కు OTT రైట్స్ @రూ.80కోట్లు?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ-2’ మూవీ డిజిటల్ రైట్స్ రూ.80+ కోట్లు పలికినట్లు సినీ వర్గాలు తెలిపాయి. OTT సంస్థ నెట్ఫ్లిక్స్ దీనిని దక్కించుకుందని పేర్కొన్నాయి. ‘అఖండ’కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీని డిసెంబర్ తొలివారంలో రిలీజ్ చేస్తామని ఇటీవల బాలయ్య తెలిపారు.
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో 7 పార్టీల క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్కు 15 మంది ఇండీ కూటమి MPలు క్రాస్ ఓటింగ్ చేశారని News18 వెల్లడించింది. ఈ మేరకు NDA వర్గాలు చెప్పాయంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నుంచి ఐదుగురు, శివసేన(UBT) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, DMK, JMM, RJD, NCP(SP)ల నుంచి ఒకరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేసినట్లు పేర్కొంది. మరోవైపు NDA తమ MPలకు 2 రోజులు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.