News April 1, 2025

ప్రకాశం: పింఛన్ నగదు మాయం

image

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్‌లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.

Similar News

News April 3, 2025

ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

image

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2025

ఒంగోలు: 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేసింది.

error: Content is protected !!