News April 1, 2025

సన్న బియ్యం పథకం చారిత్రాత్మకం: ఎమ్మెల్యే సామేలు

image

సన్న బియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 3, 2025

అనకాపల్లి: ప్రభుత్వానికి 30.46 ఎకరాల భూమి అప్పగింత

image

ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్న ఈరోజుల్లో సర్కారుకే తిరిగి భూముల్ని అప్పగించిన ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట(M) చిన భీమవరంలో చోటుచేసుకుంది. కూర్మన్నపాలేనికి చెందిన వ్యాపారవేత్త కడియాల రాజేశ్వరరావు గతంలో 30.46 ఎకరాల డిపట్టా భూములను కొనుగోలు చేశారు. గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్‌ను కలిసి ఆ భూములపై సర్వహక్కులను వదులుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ సుమారు రూ.8కోట్లపైనే.

News April 3, 2025

నాపై గృహ హింస కేసు కొట్టేయండి: హన్సిక పిటిషన్

image

తనతోపాటు తల్లిపై నమోదైన <<15080954>>గృహ హింస కేసును<<>> కొట్టేయాలంటూ హీరోయిన్ హన్సిక బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. అత్లింట్లో తనను వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు ₹20L, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని హీరోయిన్ డిమాండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్, మక్తల్‌లో కొత్త బార్ల కోసం నోటిఫికేషన్

image

పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో కొత్త బార్ల కోసం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుదారుడు రూ.లక్ష నాన్ రిఫండబుల్ ఫారం-A ద్వారా దరఖాస్తులు నింపి జిల్లా మద్య నిషేధ & ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో మహబూబ్‌నగర్ లేదా హైదరాబాద్‌లో ఏప్రిల్ 26లోపు సమర్పించాలన్నారు. https://tgbcl.telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

error: Content is protected !!