News April 1, 2025
వేసవిని దృష్టిలో పెట్టుకొని ఫాగ్ మిస్ట్ ఏర్పాటు: భద్రాచలం కలెక్టర్

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదటిసారిగా ఫాగ్ మిస్ట్ ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాచలం స్వామి వారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి పరిశీలించారు.
Similar News
News September 15, 2025
ADB: జలధారలు.. మృత్యు ఘోషలు

అసలే వానాకాలం.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పుడు అటువైపు వెళ్లకూడదని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. మొన్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబాలో నలుగురు నీటికి బలయ్యారు. నిన్న కుంటాల జలపాతం వద్ద ఇద్దరు ఇరుక్కున్నారు. సమయానికి పోలీసులు స్పందించి వారిని కాపాడారు. అందుకే జాగ్రత్తగా ఉందాం.. ప్రాణాలను కాపాడుకుందాం. కుటుంబం కంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ కాదూ.
News September 15, 2025
సిరిసిల్ల కలెక్టరేట్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కొడుకు, కోడలు తనను పోషించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.
News September 15, 2025
సిరాజ్‌కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.