News April 1, 2025

నిర్మల్: తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం: కలెక్టర్

image

తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం అందించే పోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువలున్న పోషకాలు, విటమిన్లు ఉంటాయన్నారు. ఇందులో తహాశీల్దార్ రాజు, ఆర్ఐ వెంకటరమణ ఉన్నారు.

Similar News

News November 10, 2025

హనుమకొండ: అగ్నివీర్ ఎంపిక రెండో షెడ్యూల్ వివరాలు

image

హనుమకొండలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా ఈ నెల 17న నిర్మల్, రాజన్న సిరిసిల్ల (800 మంది), 18న మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ (781 మంది) అభ్యర్థులకు ఎంపికలు జరుగుతాయి. 19న సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్ట్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

News November 10, 2025

JGTL: 3,750 ఎకరాల లక్ష్యంతో ఆయిల్ పాం సాగు

image

జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్యాక్స్ సంఘాలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ సంవత్సరం నిర్దేశించిన 3,750 ఎకరాల లక్ష్యం చేరుకోకపోవడంతో అధికారులు ప్రతి ప్యాక్స్ పరిధిలో 100 ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజ గౌడ్ అధ్యక్షతన జరిగిన శిక్షణలో అధికారులు రైతులను వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలన్నారు. ఈ పంటకు రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

News November 10, 2025

అన్నమయ్య: దత్తత అవగాహన కార్యక్రమం-2025 గోడపత్రికల విడుదల

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో ‘దత్తత అవగాహన కార్యక్రమం-2025’ గోడపత్రికలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు PGRS సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్‌లో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారిత సంరక్షణ అందించాలాన్నారు.