News April 1, 2025
అనకాపల్లి జిల్లాలో 157 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 157 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,679 మంది హాజరైనట్లు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 256 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 194 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News April 3, 2025
JEE అడ్మిట్ కార్డులు విడుదల

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈనెల 7,8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో NTA ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
News April 3, 2025
మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
News April 3, 2025
అనంతపురం అభివృద్ధికి కృషి చేయాలి- కలెక్టర్

లక్ష్య, ముస్కాన్, కయకల్ప లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, జిల్లాలోని వైద్య అధికారులు, సిబ్బందికి క్వాలిటీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం DMHO కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లతో జిల్లా నాణ్యత హామీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి మొదటి గురువారం నిర్వహించాలని అన్నారు.