News April 1, 2025

బెట్టింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: BHPL ఎస్పీ

image

బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం అన్నారు. యువత, విద్యార్థులు, అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

Similar News

News April 3, 2025

BREAKING: SRHతో మ్యాచ్.. KKR భారీ స్కోర్

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో KKR 200/6 స్కోర్ చేసింది. డికాక్(1), నరైన్(7) విఫలమవగా రఘువంశీ 50, రహానే 38, చివర్లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60, రింకూ సింగ్ 17 బంతుల్లో 32* అదరగొట్టారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

News April 3, 2025

డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

image

పెళ్లి, డేటింగ్‌ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.

News April 3, 2025

భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

image

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.

error: Content is protected !!