News April 1, 2025
బాపట్ల పోలీసు సిబ్బందికి అభినందనలు: ఐజీ

సీఎం చంద్రబాబు పర్యటనలో సమర్థవంతంగా బందోబస్తు విధులు నిర్వహించిన బాపట్ల ఎస్పీ తుషార్‌తో పాటు పోలీస్ అధికారులను, సిబ్బందిని గుంటూరు సౌత్ కోస్టల్ జోన్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాటి అభినందించారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా తీసుకున్న చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వహించడంవల్ల విజయవంతంగా సీఎం పర్యటన పూర్తి అయిందన్నారు.
Similar News
News November 5, 2025
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈఓ

వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదో తరగతి స్పెషల్ క్లాసులను ఆమె తనిఖీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగుపడాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్ పాల్గొన్నారు.
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


