News April 1, 2025
గద్వాల: ‘కుల వివక్షను రూపుమాపేందుకు పోరాటం చేద్దాం’

కుల వివక్షను రూపుమాపేందుకు KVPS ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పూలే, అంబేడ్కర్ స్ఫూర్తితో కుల వివక్షపై ప్రతిఘటన పోరాటాలు చేయాలన్నారు. కులం పేరుతో దూషించడం చట్టరీత్యా నేరమని అందరికీ తెలియజేయాలన్నారు.
Similar News
News April 6, 2025
వనపర్తిలో శవం కలకలం..!

డ్రైనేజ్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనపర్తి 20వ వార్డుకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను(46) శనివారం సాయంత్రం రామా టాకీస్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2025
‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
News April 6, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.