News April 1, 2025

నాగర్‌కర్నూల్: ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో సీతక్క మాట్లాడి.. కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాల సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Similar News

News April 5, 2025

3 అంతస్తుల్లో అసెంబ్లీ, 7 అంతస్తుల్లో హైకోర్టు: చంద్రబాబు

image

AP: అమరావతి నిర్మాణం కోసం మిగతా నిధులను వివిధ కార్పొరేషన్ల నుంచి సమీకరించేందుకు CRDAకు అనుమతిస్తూ దానిపై సమీక్షలో CM చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ(L&T), హైకోర్టు(NCC) నిర్మాణాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అసెంబ్లీని బేస్‌మెంట్+G+3+వ్యూ పాయింట్లు+పనోరమిక్ వ్యూ, హైకోర్టు బేస్ మెంట్ + G + 7 అంతస్తుల్లో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.

News April 5, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.

News April 5, 2025

హత్తుకునే కథతో 7/G సీక్వెల్: సెల్వ రాఘవన్

image

7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50% పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో రెడీ చేస్తున్నామన్నారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్‌పై మాట్లాడుతూ ‘ఇది క్లిష్టమైన కథ. భారీగా ఖర్చవుతుంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. కార్తి కూడా ఉంటారు’ అని చెప్పారు.

error: Content is protected !!