News April 1, 2025

సంబేపల్లి: మామిడి తోటకు నిప్పు

image

గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఆకతాయి పనులకు ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. మండలంలోని దేవళంపేటకు చెందిన షేక్ ఖాదర్ బాషా తన పొలంలో 80 మామిడి చెట్లను నాటి సంరక్షిస్తున్నాడు. ఈక్రమంలో తోట పక్కనున్న కళ్లకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు తోటలోకి చొరబడి పిందె దశలోని 50 చెట్లు కాలిపోయాయి. రైతు తీవ్రంగా నష్టపోయాడు.

Similar News

News April 3, 2025

ప్రతి మండల కేంద్రం వాలీబాల్ కోర్టు: కలెక్టర్

image

ప్రతి మండల కేంద్రంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాస్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి జాహ్నవి పాల్గొన్నారు.

News April 3, 2025

ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీటిని అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు ఎంపీడీవోలు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్, త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

News April 3, 2025

ఎయిర్‌ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

image

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్‌ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.

error: Content is protected !!