News April 1, 2025

సోమందేపల్లిలో ఘర్షణ.. ఒకరి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అప్పు వ్యవహారంలో బావ మారి, బావమరిది నారాయణ ఘర్షణకు దిగారు. మారీ కర్రతో దాడి చేయడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణలో మృతుడు నారాయణ అన్న అంజికి గాయాలలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News April 3, 2025

ప్రతి మండల కేంద్రం వాలీబాల్ కోర్టు: కలెక్టర్

image

ప్రతి మండల కేంద్రంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాస్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి జాహ్నవి పాల్గొన్నారు.

News April 3, 2025

ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీటిని అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు ఎంపీడీవోలు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్, త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

News April 3, 2025

ఎయిర్‌ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

image

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్‌ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.

error: Content is protected !!