News April 1, 2025

వైద్యం వ్యాపారంలా మారింది: మంత్రి సత్యకుమార్

image

AP: వైద్యవృత్తి విలువలు నేడు పలుచబడ్డాయని వైద్యమంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వైద్యుల్ని ప్రజలు దేవుళ్లుగా చూస్తారు. కానీ నేడు వైద్యం వ్యాపారంగా మారింది. అవసరం లేని పరీక్షల్ని చేయిస్తున్నారు. సహజ ప్రసవాల్ని తగ్గించేశారు. రోగుల్ని వైద్యులు చిరునవ్వుతో పలకరించాలి. నైతిక విలువల్ని పాటించాలి’ అని సూచించారు.

Similar News

News February 3, 2026

వాట్సాప్‌లో యాడ్స్.. మీకు వస్తున్నాయా?

image

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో కీలక మార్పు మొదలైంది. కొన్ని రోజులుగా స్టేటస్‌, ఛానెల్స్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగత చాట్స్‌, కాల్స్‌ పూర్తిగా యాడ్‌ ఫ్రీగానే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. యూజర్‌ లొకేషన్‌, లాంగ్వేజ్ ఆధారంగా యాడ్స్ చూపిస్తున్నాయి. దీనిపై పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News February 3, 2026

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో ఉద్యోగాలు

image

<>శ్యామ్ ప్రసాద్<<>> ముఖర్జీ పోర్ట్‌ 4 సీనియర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 17 వరకు పోస్ట్ చేయాలి. నెలకు రూ.32,900-రూ.58,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in

News February 3, 2026

మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

image

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.