News April 1, 2025

APPLY NOW.. నెలకు రూ.5000

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువును APR 15 వరకు కేంద్రం పొడిగించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News April 3, 2025

BREAKING: SRHతో మ్యాచ్.. KKR భారీ స్కోర్

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో KKR 200/6 స్కోర్ చేసింది. డికాక్(1), నరైన్(7) విఫలమవగా రఘువంశీ 50, రహానే 38, చివర్లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60, రింకూ సింగ్ 17 బంతుల్లో 32* అదరగొట్టారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

News April 3, 2025

డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

image

పెళ్లి, డేటింగ్‌ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.

News April 3, 2025

ఇతడి కోసమే ముగ్గురు పిల్లల్ని చంపేసింది!

image

TG: ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా <<15966011>>హత్య<<>> చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది. అయితే పిల్లలు లేకుంటేనే చేసుకుంటానని అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది.

error: Content is protected !!