News April 1, 2025
SLBCలో కొనసాగుతున్న స్టీల్ తొలగింపు పనులు

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి SLBCలో స్టీల్ తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. SLBC టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ మంగళవారం SLBC ఆఫీస్ వద్ద సొరంగం ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్న సహాయక బృందాల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.
Similar News
News January 25, 2026
APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

<
News January 25, 2026
సింగరేణి కార్మికులపై పన్ను భారం తగ్గించాలని వినతి

సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక ప్రసాద్ తీసుకెళ్లారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సింగరేణిలోనూ వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు.
News January 25, 2026
పశ్చిమగోదావరి జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం

ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప.గో జిల్లాకు రాష్ట్రస్థాయిలో “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు-2025” లభించింది. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంశాల్లో 12 జిల్లాలను ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదులో ప.గో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.


