News April 2, 2025
రేపట్నుంచి RTC ఉద్యోగుల నిరసనలు

AP: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ RTC ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, నైట్‌అవుట్ అలవెన్స్ ₹150 నుంచి ₹400 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News January 5, 2026
20% నిల్వలున్నా.. 1% ఉత్పత్తే: వెనిజులాకు ఎందుకీ దుస్థితి?

ప్రపంచ చమురు నిల్వల్లో 20% వాటా ఉన్న వెనిజులా ప్రస్తుతం కేవలం 1% (10 లక్షల బ్యారెళ్లు) మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 1990ల్లో 35 లక్షలుగా ఉన్న ఈ ఉత్పత్తి.. స్కిల్డ్ వర్కర్ల తొలగింపు, కంపెనీల జాతీయీకరణ, అవినీతి, నిధుల మళ్లింపు, అమెరికా ఆంక్షల వల్ల ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మదురోను బంధించిన ట్రంప్.. US కంపెనీల పెట్టుబడులతో ఈ భారీ నిల్వలను వెలికితీసి ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించాలని స్కెచ్ వేశారు.
News January 5, 2026
గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.
News January 5, 2026
ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


