News April 2, 2025

MDCL: ప్రభుత్వానికి బిగ్ THANKS: HCA

image

HYD ఉప్పల్ స్టేడియంలో ఉచిత పాసులు ఇవ్వకపోవడంపై SRHపై HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు ఒత్తిడి తెచ్చారని వచ్చిన వార్తల నేపథ్యంలో, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టింది. దీనిపై స్పందించిన జగన్మోహన్ రావు ప్రభుత్వానికి X వేదికగా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వ జోక్యం, SRH, అపెక్స్ కౌన్సిల్ కలిసి రాబోయే మ్యాచ్ సక్సెస్ కావడం కోసం చేపట్టిన చర్యలను అభినందించారు.

Similar News

News April 3, 2025

HYD: భారీ వర్షం.. ప్రజలకు జలమండలి ఎండీ సూచనలు

image

భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

News April 3, 2025

కార్యదర్శుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం

image

మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం(TPSF) గ్రామ కార్యదర్శులకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని జేపీఎస్, ఓపిఎస్ సెక్రటరీల పెండింగ్ వేతనాలు, గ్రామ పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు సహా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, టీపీఎస్ఎఫ్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2025

రేపు మోస్తరు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: ఇవాళ కృష్ణా, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వర్షాలు కురిసినట్లు APSDMA తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు రెయిన్స్ పడతాయని పేర్కొంది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!