News April 2, 2025

నస్పూర్: అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నస్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పంపిణీ చేస్తామన్నారు. అధికారుల సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బ్రహ్మారావు పాల్గొన్నారు.

Similar News

News January 30, 2026

లైంగిక వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు: ASF కలెక్టర్

image

పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత హెచ్చరించారు. శుక్రవారం ASF కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత సేవా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్ – 2013పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లైంగిక వేధింపులకు గురైతే బాధిత మహిళలు 15100 హెల్ప్ లైన్‌ను సంప్రదించాలన్నారు.

News January 30, 2026

BHPL: ప్రజావాణి రద్దు.. ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణిని యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News January 30, 2026

MMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>MMRCL<<>>) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.mmrcl.com