News April 2, 2025
KMR: కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ యోధ మెంబర్షిప్ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన జాతీయ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నీలం రమేశ్ ఉన్నారు.
Similar News
News October 30, 2025
ముంపు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ సీపీ

వరంగల్ నగరంలో నీట మునిగిన ప్రాంతాలను సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహ నిర్బంధమైన ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలన్నారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని కోరారు.
News October 30, 2025
వరద బాధితులు అధైర్యపడవద్దు: మంత్రి సురేఖ

మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాలను జలమయం చేశాయి. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వరద బాధితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని.. నగర నాలాల విస్తరణ, కబ్జాల తొలగింపు, ప్రణాళికాబద్ధమైన నికాసి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
News October 30, 2025
అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ MLA తోటలక్ష్మీ కాంతారావు సమక్షంలో గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ, విద్యా, వైద్యం, DRDO, R&B వంటి వివిధ శాఖల ప్రగతిపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు ఎమ్మెల్యే తెలిపారు.


