News April 2, 2025

WNP: ‘నిజాం పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్’

image

సెంట్రల్ యూనివర్సిటీ HCU 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఖండించారు. వనపర్తిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలం వేస్తూ విద్యావ్యవస్థను కూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. యూనివర్సిటీ భూములు వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 12, 2026

“ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

image

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, పూర్వ వరంగల్ డీపీఆర్ఓ కన్నెగంటి వెంకటరమణ రచించిన “సమ్మక్క.. ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మేడారంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడారం ప్రాశస్త్యం, వనదేవతల గొప్పతనం, ఆదివాసీల సంప్రదాయం, గడిచిన ఇన్నేళ్లలో మేడారంలో జరిగిన మార్పులు- అభివృద్ధి వంటి సకల సమాచారంతో పుస్తకాన్ని రూపొందించడం పట్ల మంత్రి అభినందించారు.

News January 12, 2026

పాపం శ్రీలీల.. బాలీవుడ్‌పైనే ఆశలు

image

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల చెప్పుకోదగ్గ హిట్లు లేక సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో ఆఫర్లు రావడం గగనమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న బాలీవుడ్ మూవీపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకున్నారు.

News January 12, 2026

జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.