News April 2, 2025

‘చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి’

image

తిరుపతి జిల్లా పరిధిలోని చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జేసీ శుభం భన్సల్‌తో కలిసి ఆయన అధికారంతో సమావేశం నిర్వహించారు. చెరువులను సుందరీకరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలని అధికారులకు ఆయన సూచించారు.

Similar News

News November 15, 2025

‘మా అమ్మ చనిపోయింది.. డబ్బుల్లేవని చెప్పినా దాడి చేశారు’

image

ఇటీవల మేడ్చల్ జిల్లాలో <<18258825>>హిజ్రాల<<>> దాడిలో గాయపడ్డ సదానందం కీలక విషయాలు వెల్లడించారు. ‘పాలు పొంగించేందుకు కొత్త ఇంటికి వచ్చాం. అది గృహప్రవేశం కాదు. హిజ్రాలు రూ.లక్ష డిమాండ్ చేశారు. తల్లి చనిపోయింది, డబ్బుల్లేవని చెప్పినా వినకుండా బూతులు తిట్టారు. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించారు. ఆ తర్వాత 15-20 మంది వచ్చి హంగామా చేస్తుంటే బెదిరించా. తిరిగి నాపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు’ అని తెలిపారు.

News November 15, 2025

గొర్రె పిల్లలకు వివిధ దశల్లో ఇవ్వాల్సిన ఆహారం

image

గొర్రె పిల్లల పెరుగుదలకు అందించాల్సిన ఆహారంపై వెటర్నరీ నిపుణుల సూచనలు
☛ పిల్ల పుట్టిన మొదటి 3 రోజుల వరకు: తల్లితో పాటు పిల్లను ఉంచి.. పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతి రోజూ అందించాలి.
☛ తొలి 2 వారాల వరకు: పిల్లలను పూర్తిగా తల్లిపాల మీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600ml పాలు అందించాలి. తల్లి వద్ద సరిపడినన్ని పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి.

News November 15, 2025

IIRSలో 11 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌ (<>IIRS<<>>) 11 JRF పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 నుంచి డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iirs.gov.in/