News April 2, 2025

పైలెట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయండి: జేసీ

image

వారం రోజుల్లోగా పైలట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం మాట్లాడుతూ.. జిల్లాలో 25 పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందన్నారు. గ్రామ సరిహద్దులు నిర్ణయించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి నారద ముని, ఆర్డీవో మధులత పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

NGKL: మద్యం టెండర్లతో జిల్లాకు రూ.450.04 కోట్ల ఆదాయం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రూ.450 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చింది. జిల్లాలోని 67 దుకాణాలకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయడంతో ఈ ఆదాయం సమకూరింది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 500కు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News October 26, 2025

భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

image

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.

News October 26, 2025

కరీంనగర్‌లో ఇంటి ‘ఓనర్ల OVER ACTION’..!

image

కరీంనగర్‌లో ఓ ఇంటికి వేలాడదీసిన TO-LET బోర్డ్ చర్చకు దారితీసింది. పలు సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ బోర్డుపై ఆయా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విషయమేంటంటే.. కిసాన్ నగర్‌లోని కొందరు ఇంటి ఓనర్లు తమ ఇళ్లల్లో ఉన్న రూంలను అద్దెకు ఇచ్చేందుకు గేట్లకు టూ-లెట్ బోర్డులు పెట్టారు. అందులో కేవలం హిందువులకు మాత్రమే రూం రెంట్‌కి ఇస్తామని.. ముఖ్యంగా SC, ST వాళ్లకి NO-ENTRY అని రాశారు.