News March 26, 2024

HYD: ఎవరీ శ్రీనివాస్ యాదవ్..?

image

BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్‌లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్‌ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.

Similar News

News January 15, 2026

HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

image

​శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.

News January 15, 2026

HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

image

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయట.

News January 15, 2026

ఓల్డ్ సిటీ మెట్రో ముచ్చట.. ఇల్లు పోయినా ‘పై అంతస్తు’ ఆశ!

image

దారుల్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట దాకా సుమారు 450 ఇళ్లు, షాపులను కూల్చేయడానికి సర్కారు మార్కింగ్ ఇచ్చేంది. ఇల్లు పోతుందని బాధపడే వాళ్ల కోసం ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఇల్లు కొంచెం పోయినా పైన రెండు అంతస్తులు ఎక్స్‌ట్రా కట్టుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తారట. ఇక L&T, ప్రభుత్వానికి మధ్య జరిగిన డీల్ చూస్తే మతిపోవాల్సిందే. అప్పులన్నీ ప్రభుత్వం నెత్తిన, మెట్రో మాల్స్ మీద వచ్చే లాభాలు ఆ కంపెనీ తీసుకుంటుందట.