News April 2, 2025

5 ఉద్యోగాలు సాధించిన గూడెం రైతుబిడ్డ

image

5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కష్టాలు దూరం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు రైతు బిడ్డ చుంచు ఆనంద్. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి గోపాల్- సత్తెవ్వ దంపతులు వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తుంటారు. వారి కుమారుడు ఆనందర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో POగా ఎంపికయ్యారు. అలాగే కెనరా బ్యాంక్ క్లర్క్, UNION BANK LBO, IBPS PO, IDBI ఎగ్జిక్యూటివ్ పరీక్షల్లోనూ సత్తాచాటారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 10, 2025

శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.

News November 10, 2025

అనకాపల్లి జిల్లా పోలీస్ పీజీఆర్ఎస్‌కు 50 ఫిర్యాదులు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు 50 ఫిర్యాదులను అందజేశారు. ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు.భూ తగాదాలకు సంబంధించి 19, రెండు కుటుంబ కలహాలు, రెండు మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర విభాగాలకు చెందినవి 27 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 10, 2025

తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

image

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్‌కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.