News March 26, 2024
HYD: ఎవరీ శ్రీనివాస్ యాదవ్..?

BRS HYD ఎంపీ అభ్యర్థిగా స్థిరాస్తి వ్యాపారి, హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్‌ను KCR ప్రకటించిన విషయం తెలిసిందే. 56ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్‌లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989లో NSUI ఓయూ ఇన్‌ఛార్జి, NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్యదర్శిగా, 2006-2011వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు.
Similar News
News March 19, 2026
జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.
News March 18, 2026
RR: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు చేయండి: కలెక్టర్

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.
News March 18, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.


