News April 2, 2025
శుభ ముహూర్తం (2-04-2025)

☛ తిథి: శుక్ల చవితి ఉ.7.33 వరకు ☛ నక్షత్రం: కృత్తిక మ.1.47 వరకు ☛ శుభ సమయం: సా.6.56 నుంచి 7.26 గంటల వరకు ☛ రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు ☛ యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48 వరకు, మ.2.48 నుంచి 3.36 గంటల వరకు ☛ వర్జ్యం: ఉ.6.22 వరకు, సా.5.44-సా.7.15 వరకు ☛ అమృత ఘడియలు: ఉ.9.23-ఉ.10.55 వరకు
Similar News
News April 6, 2025
చెన్నై చెత్త రికార్డు

IPL: చెన్నై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో 5 నెమ్మదైన హాఫ్ సెంచరీల్లో 3 CSK ఆటగాళ్లవే కావడం గమనార్హం. విజయ్ శంకర్ 43, రచిన్ 42, జైస్వాల్ 40, లివింగ్‌స్టోన్ 39, గైక్వాడ్ 37 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. అటు నిన్న ధోనీ క్రీజులోకి వచ్చిన 19 బంతుల తర్వాత బౌండరీ బాదారు. మ్యాచులు ఓడిపోవడం సహజం అని, అయితే చెన్నై బ్యాటర్లలో గెలవాలన్న కసి కనిపించట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News April 6, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. మార్కెట్లకు పరిగెడుతున్న అమెరికన్లు

ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో అన్ని వస్తువులపై రేట్లు పెరుగుతాయన్న ఆందోళన అమెరికావ్యాప్తంగా నెలకొంది. దీంతో జనాలు సూపర్ మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ దుకాణాల వరకూ పోటెత్తుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, బూట్లు, కార్లు, విదేశీ ఆహారాలు, విద్యుత్ పరికరాలు.. ఇలా అన్ని రకాల వస్తువులకూ భారీ డిమాండ్ నెలకొంది. ఏ షాపింగ్ మాల్ చూసినా జనం భారీగా కనిపిస్తున్నారు.
News April 6, 2025
న్యూస్ రౌండప్

* AP: అనకాపల్లి ఫార్మా సిటీలో ప్రమాదం.. విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
* తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. స్వామిని దర్శించుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా
* TG: శ్రీశైలం SLBCలో 43 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ
* శ్రీరామనవమి వేళ అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీ