News April 2, 2025
అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.
Similar News
News April 3, 2025
రేపు మోస్తరు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: ఇవాళ కృష్ణా, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వర్షాలు కురిసినట్లు APSDMA తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు రెయిన్స్ పడతాయని పేర్కొంది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 3, 2025
ఢిల్లీలో మూడో రోజు బీసీ రిలే నిరాహార దీక్షలు

బీసీలకు 42% రిజర్వేషన్ విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఓబిసి ఆజాదీ సత్యాగ్రహ్’ దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలోని పలువురు నాయకులు దీక్షలోని నాయకులను పరామర్శించి మద్దతు ఇచ్చినట్లు బీసీ నాయకులు గంగాధర్ తెలిపారు. పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించాలని డిమాండ్ చేశారు.
News April 3, 2025
HYD: అప్రమత్తంగా విద్యుత్‌శాఖ సిబ్బంది

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారు. వెంట వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.