News April 2, 2025
నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Similar News
News April 8, 2025
IPL: ఓడిపోయినా మనసులు గెలుచుకున్నాడు

లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కేకేఆర్ పోరాడి ఓడింది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. చివరి ఓవర్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్ మొదట్లోనే స్టైక్ వస్తే రింకూ కచ్చితంగా గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 8, 2025
ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్‌సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.
News April 8, 2025
కెనడాలో ఉండేవారికి శుభవార్త.. కనీస వేతనం పెంపు

కెనడా ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ సెక్టార్‌లో కనీస వేతనాలను పెంచింది. ప్రస్తుతం గంటకు కనీస వేతనం 17.30 డాలర్లు ఉండగా దాన్ని 17.75 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల్లో ద్రవ్యోల్బణం అంశమే కీలక అజెండాగా మారింది. కెనడా జనాభాలో 3.7% ఉన్న భారతీయులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.