News April 2, 2025
2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి శివప్రసాద్

వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.
Similar News
News April 4, 2025
సుప్రీం కోర్టుకు వందనాలు: ఆర్ఎస్పీ

గచ్చిబౌలిలో ‘వనమేధాన్ని’ అడ్డుకున్న సుప్రీం కోర్టుకు వందనాలు అంటూ పాలమూరు BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Xలో ట్వీట్ చేశారు. HCU విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అబద్ధాల ఆక్సిజన్‌తో, పోలీసుల పహారాలో, ప్రజల నుంచి దూరంగా తమ బంగళాల్లో సేద తీరుతున్న రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.
News April 4, 2025
MBNR: రజతోత్సవ వేడుకల సమావేశంలో ఆర్ఎస్పీ

ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాలను చక్కగా, ఓపికగా కేసీఆర్ వివరించారన్నారు. భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడరాదని దిశా నిర్దేశం చేశారన్నారు.
News April 4, 2025
BREAKING: SRH ఘోర ఓటమి

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.