News April 2, 2025
ములుగు: ‘రజతోత్సవ సభను విజయవంతం చేస్తాం’

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈరోజు హైదరాబాదులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.
Similar News
News April 6, 2025
భీమ్‌గల్: సీతారాముల కళ్యాణంలో PCC చీఫ్

భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్ది రామన్నస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ సతీమణితో కలిసి కళ్యాణ క్రతువుని కనులారా వీక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
News April 6, 2025
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
News April 6, 2025
నిజాంపట్నం: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

రొయ్యల చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లి వెంకటరెడ్డి మృతి చెందిన ఘటన ఆదివారం నిజాంపట్నంలో చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. కర్లపాలెం మండలం పెదపులుగు వారిపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి నిజాంపట్నంలో రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుంటాడు. చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లిన ఆయన కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.