News April 2, 2025

నాగర్‌కర్నూల్: GREAT.. 3 GOVT జాబ్స్ కొట్టింది..!

image

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలానికి చెందిన మద్దెల శైలజ సత్తా చాటింది. కృషి, పట్టుదలతో గ్రూప్-2, 3, 4 పరీక్షల్లో విజయాన్ని సాధించింది. ప్రజాసేవ తన లక్ష్యమని పేర్కొన్న శైలజ, సివిల్స్ వైపు అడుగులు వేస్తానని తెలిపింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించానని పేర్కొన్న శైలజను, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమె మహిళలకు, నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచారని పలువురు అభినందించారు.

Similar News

News September 17, 2025

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.

News September 17, 2025

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

image

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

image

1948 SEP 10న నిజాం UNOలో భారత్‌పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.