News April 2, 2025
రిషభ్ పంత్‌కు పంజాబ్ కింగ్స్ కౌంటర్

మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌పై PBKS కౌంటర్ ఇచ్చింది. రాత్రి LSGపై మ్యాచ్ గెలిచిన తర్వాత ‘మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా వేలం అనంతరం పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొంటుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకోవడంతో లక్నో టీమ్‌లో చేరగలనని భావించా’ అంటూ చెప్పుకొచ్చారు.
Similar News
News April 5, 2025
SBI UPI సేవల్లో అంతరాయం!

UPI సేవల్లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు SBI ప్రకటన విడుదల చేసింది. దీని కారణంగా వినియోగదారులకు UPI సేవల్లో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని SBI వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE వాడాలని సూచించింది. మీకూ ఈ సమస్య ఎదురైందా? COMMENT
News April 5, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు.. హర్ష కుమార్‌పై కేసు నమోదు

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ MP హర్ష కుమార్‌పై తూ.గో.(D) రాజానగరం పోలీసులు BNS సెక్షన్లు 196, 197 కింద FIR నమోదు చేశారు. ప్రవీణ్‌ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.
News April 5, 2025
బాలీవుడ్ అవార్డుల కన్నా ఈ చీర గొప్పది: కంగన

ఓ అభిమాని పంపిన కాంచీపురం సిల్క్ చీరను ఉద్దేశించి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన బాలీవుడ్ అవార్డుల కన్నా అద్భుతమైన చీర ఎంతో బెటర్ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కంగన తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను మెచ్చి ఓ వ్యక్తి ఈ చీరను పంపడం గమనార్హం. జనవరి 17న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచినా ఓటీటీలో మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.