News April 2, 2025
ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

సమ్మర్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.
Similar News
News April 13, 2025
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ!

AP: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను చేనేతశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే ఐటీశాఖ సెక్రటరీ కె.భాస్కర్‌కు ఏపీహెచ్ఆర్‌డీఏ డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు, సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
News April 13, 2025
రేపు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.
News April 13, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ఐపీఎల్‌లో భాగంగా ఆర్ఆర్‌తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, కృనాల్, జితేశ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్, యశ్ దయాల్.
RR: జైస్వాల్, శాంసన్ (C), రానా, పరాగ్, జురేల్, హెట్‌మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.