News April 2, 2025

హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

image

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News April 4, 2025

నరసాపురం: లేసు అల్లికదారులతో మాట్లాడిన కలెక్టర్

image

నరసాపురం మండలం రుస్తుంబాద లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా లేసు అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం, బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేసు ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్  పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేసు అల్లికను తెచ్చి పెట్టుకునేలా నైపుణ్యతను చూపించాలని తెలిపారు.

News April 3, 2025

నరసాపురం: ఉగాది పండక్కి వచ్చి తిరిగి రాని లోకాలకు

image

నరసాపురం మండలం చిట్టవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా నవరత్నం (బాషా) మృతి చెందిన విషయం తెలిసిందే. నవరత్నం హైదరాబాదులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఉగాది పండక్కి వచ్చి తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నాడు. ఈలోగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తమకు దిక్కెవరు అంటూ నవరత్నం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి తీరు చూపరులకు కంట తడి పెట్టించింది.

News April 3, 2025

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయం: కలెక్టర్

image

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్‌ ఫారమ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్లను మెప్మా అధికారులు జిల్లా కలెక్టర్‌కు చూపించారు. 

error: Content is protected !!