News March 26, 2024
వైసీపీకి 10 సీట్లకు మించి రావు: బైరెడ్డి

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 10 అసెంబ్లీ సీట్లకు మించి రావని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని తెదేపా కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, మన రాష్ట్రంలో అంతకంటే ఎన్నో రెట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు.
Similar News
News March 17, 2025
కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.
News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News March 17, 2025
కర్నూలు: నేలపైనే పరీక్షలు రాశారు..!

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరైన వసతులు కల్పించలేదని విద్యార్థులు ఆరోపించారు. 270 మంది విద్యార్థులు నేలపైనే కూర్చొని పరీక్ష రాశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. కనీసం బెంచీలు ఏర్పాటు చేయలేదు. రేపటి పరీక్షకు బెంచీలు ఏర్పాటు చేస్తామని MEO సత్యనారాయణ చెప్పారు.