News April 2, 2025
రామచంద్రపురం: స్నానానికి దిగి విద్యార్థి మృతి

రామచంద్రపురం మండలం వెల్ల లాకుల వద్ద మంగళవారం కాలువలోకి స్నానానికి దిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఎలమంచిలి అఖిల్ (15) పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పరీక్షలు పూర్తి కావడంతో స్నేహితులతో కలిసి పంట కాలువలో స్నానానికి దిగారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో అఖిల్ కొట్టుకుపోయాడు. సాయంత్రానికి మృతదేహం లభించింది.
Similar News
News April 6, 2025
నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. నేడు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
News April 6, 2025
తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News April 6, 2025
ఈ నెల 30 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ యాత్ర ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6వేలకు పైగా పోలీసుల్ని, భద్రతాసిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 10 కి.మీకి ఒక సెక్టార్ చొప్పున 137 సెక్టార్లుగా యాత్ర మార్గాన్ని విభజించామని నిరంతరం భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతుంటారని వారు స్పష్టం చేశారు.