News April 2, 2025
పులివెందులలో యువకుల మధ్య ఘర్షణ

పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో మంగళవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు యువకులంతా కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ నరసింహులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో గొడవకు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 4, 2025
వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్‌ఛార్జ్ భేటీ

పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
News April 3, 2025
కడప వాసులకు గర్వకారణం: తులసిరెడ్డి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.
News April 3, 2025
కడప జిల్లాలో యూట్యూబర్స్‌పై కేసు నమోదు

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్‌పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.